సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య.


 సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య.

మృతుడిపై ఇప్పటికే ఐదు హత్య కేసులు.

జైల్లో శిక్ష అనుభవించి బెయిల్పై ఉన్న నిందితుడు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి ఫిబ్రవరి:27

మాడుగుల మండలం జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబు (27)ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలోని ఒక చోరీ కేసులో ఆయన జైల్కు వెళ్లొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు. గురువారం రాత్రి సత్యవరం, జంపెన గ్రామాల సమీపంలో ఈ హత్య జరిగిందని మాడుగుల ఎస్ఐ జి.నారాయణరావు విలేకరులకు తెలిపారు. కే.కోటపాడు సీఐ కృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తునమాని. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ హత్యోదంతంతో జంపెన గ్రామంలో భయాందోళనలు నెలకున్నాయి.సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబు మాడుగుల మండలం జంపెన గ్రామంలో 2021లో రెండు హత్యలు చేశాడు. అదే విధంగా మాకవరపాలెంలో 2024లో మరో రెండు హత్యలు చేశాడు. మునగపాకలో ఒక హత్య చేశాడు. ఇలా మొత్తం ఐదు కేసుల్లో ఉపేంద్ర ఇప్పటి వరకు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఎవరివద్దనైనా డబ్బు దోచుకుని, వారిని హత్య చేయడమే ఉపేంద్ర ప్రధాన లక్ష్యంమని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాల్ని ఆరా తీసేందుకు మాడుగుల ఎస్ఐ జి.నారాయణరావు, కె.కోటపాడు సీఐ కృష్ణ, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తదితరులు విచారణను ముమ్మరం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post