ఏలూరులో పందుల స్వయంవిహారం.
పట్టించుకోని మునిసిపల్ అధికారులు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరులో స్థానిక పాత బస్టాండ్ ఎదురుగా కృష్ణా కాలువ గట్టున చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. సిటీ సెంటర్ లో ఎక్కడి చెత్త చెదారం అక్కడే ఉండి పందులు విచ్చలవిడిగా తిరిగుతున్నా పట్టించుకోని ఏలూరు నగరపాలక అధికారులు.. ఇదే ప్లేస్ లో చెత్త నిల్వ ఉంచుతున్నారు పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి అని పలుమార్లు వార్త కాదనాలలో వచ్చినా కమీషనర్ వార్త కధనలపై స్పందించకపోవడం...ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం... డోర్ కలెక్షన్ మూడు రోజులకు ఒక్కసారి రావడం... నగరంలో ఎక్కడ చూసిన చెత్త చెందారం నిండి పందులు విహారిస్తుంటే మునిసిపల్ అధికారులు మాత్రం అధికార మత్తులో నుండి భయటకు రావడం లేదు.. నగరంలో ఎక్కడచూసినా చీకటి పడిన తరువాత దోమల బెండద విపరీతంగా ఉంది... అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ప్రజలు మునిసిపల్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.. కమీషనర్, కలెక్టర్ అధికారులు ఏసి గధులలో కూర్చోవడం కాదు.. ఏలూరు లో సాయంత్రం అయ్యాక సిటీ లో ఏదైనా ప్లేస్ కి వెళ్లి ఒక్క గంట సేపు సామాన్యుడిలాగా నగరంలో ఎక్కడైనా నిలుచుంటే తెలుస్తుంది అధికారులకి ప్రజల ఇబంధులు అని నగర ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు... ప్రజల అభిప్రయం కరెక్ట్ కాదని... నగరంలో ఎక్కడైనా ఒక్క గంట ఎటువంటి రక్షణా చర్యలు లేకుండా ఒక్కగంట కూర్చొని ప్రజల అభిప్రాయం తప్పుగా ఉంది అని నిరూపించగలరా... నగరంలో ఎక్కడచూసిన డ్రైనేజి వ్యవస్థ అద్వాణంగా ఉంది.. డ్రైనేజీ క్లీన్ చెయ్యడానికి వీలు లేని విధంగా నగరంలో డ్రైనేజి ఆక్రమితకు గురిఅయ్యి... చెత్త తో నిండిపోయి... మురుగు నీరు నిల్వ ఉండి దోమలు ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉందని తెలిసినా... నగర మునిసిపల్ కమీషనర్ డ్రైనేజీ ఆక్రమితలపై చర్యలు మాత్రం తీసుకోరు... వారు వారి జీతాలు తీసుకోవడంలో ఉండే శ్రద్ధ... ప్రజల ఆరోగ్యం పట్ల కాస్త చూపితే బాగుంటుందని సామాన్య ప్రజల అభిప్రాయం.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో... వేచి చూడాలి.
