మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాగా సమిష్టిగా తీర్చిదిద్దుదాము జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.



 మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాగా సమిష్టిగా తీర్చిదిద్దుదాము జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.

గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలు కేసులలో పట్టుబడితే కఠిన శిక్షలు.

ఉద్యోగాలకు, పాస్పోర్టులకు అనర్హత, శాశ్వత క్రిమినల్ రికార్డు, భవిష్యత్తు అంధకార మయం.

నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 సద్వినియోగం చేసుకోవాలి.

యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దు, మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ జిల్లా కలెక్టరు అధ్యక్షతన కె.వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు, ఫిబ్రవరి 27: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయీ మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారమవుతుందని యువతలో అవగాహన కలిగించి, యువత మాదకద్రవ్యాలు జోలికి పోకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలుతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు కలిగి వున్నను, వినియోగం, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలకు, పాస్పోర్ట్ లు జారీకి అనర్హతతో పాటు శాశ్వత క్రిమినల్ రికార్డు కలిగి ఉంటారని, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు. మాదకద్రవ్యాలు వినియోగం పై దుష్పరిణామాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కలిగించేందుకు ప్రతీ పాఠశాల, కాలేజీలలోనూ పోస్టర్ల ద్వారా మరియు క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నా, పెడ్లర్స్ సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగు తుందన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి డిఅడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగు తుందన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించ కుండా ఔషధ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. ట్రైన్లు, రవాణా వాహనాలు ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణాని నియంత్రించేందుకు ఆపరేషన్ విజయ్ ద్వారా గట్టి నిఘా పెట్టాలన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పిల్లలు డ్రగ్స్ మత్తు పదార్థాలు అలవాటు కాకుండా గట్టిగా పెట్టాలన్నారు. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందని, నడకలో, కళ్ళు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటి కప్పుడు పరిశీలించుకుని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. మన పిల్లలు ఎటువంటి వారితో స్నేహాలు చేయుచున్నారని, ఒక కంట కనిపెడుతూ పరిశీలన చేయాలన్నారు. చెడు స్నేహలు వల్ల పిల్లలు సిగరెట్టుకు అలవాటు పడతారని, తర్వాత దొంగతనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారని పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 సంప్రదించాలని, ఫోన్ చేసిన తక్షణం టీమ్లు క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టి తక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తొలి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను అతి సులువుగా తప్పించ వచ్చునని తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ డా.బి. పాల్ సతీష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా.సి.హెచ్. సూర్య చక్రవేణి, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి.శేఖరు, విభిన్న ప్రతిభా వంతుల శాఖ సహాయ సంచాలకులు బి.రామ కుమార్, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నమ్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post