చోరీ కేసులో నిందుతుడు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన చోడవరం పోలీసులు.
నిందుతుడుకు 14 నెలలు సాధారణ జైలు శిక్ష తీర్పు ఇచ్చిన చోడవరం కోర్టు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:05 .చోడవరం ఫిర్యాదుదారు కంబిడి రవణ కుమారి, భర్త పేరు పంతులు, ఇచ్చిన సమాచారం మేరకు చోడవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి, 24.12.2024 తేదీన గాజువాక నుండి పాడేరు వెళ్లేందుకు గాజువాక నుంచి చోడవరం వరకు బస్సులో ప్రయాణించి, చోడవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద మధ్యాహ్నం సుమారు 1:00 గంట సమయంలో బస్సు దిగి, పాడేరు వెళ్లే మరో బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగ్‌లోని పర్సును దొంగిలించినాడు. ఆ పర్సులో రూ.1,000/- నగదు ఉన్నది. వెంటనే ఆమె బస్సు నుండి దిగివచ్చి దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అతడు సంఘటన స్థలం నుండి పారిపోయినాడు. అట్టి వ్యక్తిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఈ ఫిర్యాదు సమర్పించినది. దర్యాప్తు సందర్భంగా చోడవరం సీఐ, పి.అప్పలరాజు సూచనల మేరకు దర్యాప్తు చేసిన అధికారి బి. నాగ కార్తిక్, ఎస్.ఐ. ఆఫ్ పోలీస్, చోడవరం పోలీస్ స్టేషన్, నిందితుడిని అరెస్ట్ చేసి, గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరు పరచగా, న్యాయస్థానం వారు నిందితుడిని రిమాండ్‌కు పంపించినారు. వాదనలు విన్న అనంతరం గౌరవనీయ JFCM న్యాయస్థానం, చోడవరం, నిందితుడికి 14 నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చినట్టు చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు.
.jpg)