6,500 మందికి విద్యార్థుల‌కు సైకిళ్లు అందజేసిన మంత్రి గొట్టిపాటి.




 6,500 మందికి విద్యార్థుల‌కు సైకిళ్లు అందజేసిన మంత్రి గొట్టిపాటి. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

విద్యార్థులు న‌డిచే ఇబ్బంది త‌ప్పించేందుకే సైకిళ్ల పంపిణీ

ప్రైవేటుకు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌

త‌ల్లికి వంద‌నం కోస‌మే రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్,

 ప్రకాశం జిల్లా అద్దంకి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థులు ఇంటి నుంచి పాఠ‌శాల‌ల‌కు న‌డిచి వ‌చ్చే ఇబ్బందిని త‌ప్పించేందుకే సైకిళ్ల‌ పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో ప్రారంభించినట్లు ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు.

 అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలోని కొమ్మినేనివారి పాలెం జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌కు చెందిన 105 మందికి, వ‌ల్లాప‌ల్లి పాఠ‌శాల‌కు చెందిన 71 మందికి, అంబ‌డిపూడి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌కు చెందిన 124 మంది విద్యార్థుల‌కు మంత్రి గొట్టిపాటి బుధ‌వారం నాడు సైకిళ్ల‌ను పంపిణీ చేశారు.

 ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడాతూ.ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. 

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు 6,500 మంది విద్యార్థుల‌కు అసిస్ట్ సేవా సంస్థతో పాటు పలువురు దాత‌లు అందించిన‌ సీఎస్ఆర్ నిధుల‌తో సైకిళ్ల‌ను పంపిణీ చేశామ‌న్నారు. 

ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌తో పాటు కొంద‌రు ఇంట‌ర్ విద్యార్థుల‌కు కూడా సైకిళ్ల‌ను అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. ఒక్కొక్క‌టి రూ.1.30 ల‌క్ష‌ల విలువైన‌ ట్రై సైకిళ్ల‌ను కూడా 135 మందికి అందించామ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా మ‌రో 4000 మంది ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌కు ద‌శ‌ల వారీగా సైకిళ్ల‌ను అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే 16,300 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసి ప్ర‌భుత్వ విద్య‌ను బ‌లోపేతం చేసిన‌ట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. 

గ‌తంలో ఒక్కో టీచ‌ర్ ఐదు త‌ర‌గ‌తులు చెప్పే వార‌ని, ఇప్పుడు ప్ర‌తి క్లాస్ కూ ఒక టీచ‌ర్ ఉన్నార‌ని తెలిపారు. 

అదే విధంగా అర్హులైన విద్యార్థులు అంద‌రికీ, కుటుంబంలో ఎంత మంది ఉన్నా., ఒక్కొక్క‌రికీ రూ.15,000 అందిస్తున్నామ‌ని చెప్పారు. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా త‌ల్లికి వంద‌నం విద్యార్థుల కోస‌మే రూ.10,000 కోట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిందని అన్నారు.

 ఒక్కో ఇంట్లో ఇద్ద‌రు విద్యార్థుల‌కు ఆర్థిక స‌హాయం చేస్తాన‌న్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి., ఒక్క‌రికే స‌హాయం చేశార‌ని మంత్రి గొట్టిపాటి విమ‌ర్శించారు. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నాసిర‌కం షూలు, యూనిఫాంలు ఇచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో నాణ్య‌మైన‌వి ఇవ్వ‌డంతో పాటు ప్ర‌తి విద్యా సంవ‌త్స‌ర ఆరంభానికే పుస్త‌కాలు కూడా అందిస్తున్నామ‌న్నారు.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స్ట‌డీ మెటీరియ‌ల్.

సైకిళ్ల పంపిణీ అనంత‌రం నారాయ‌ణ స్కూల్ వారు అందించిన‌ 10వ త‌ర‌గ‌తి స్ట‌డీ మెటీరియ‌ల్ ను అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. 

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే 2000 మందికి కూడా ఈ స్ట‌డీ మెటీరియ‌ల్ అందించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. విద్యార్థులు అంద‌రూ చ‌క్క‌గా చ‌దువుకుని ఉన్న‌త స్థానాల‌కు వెళ్లాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. 

అదే విధంగా ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ పెట్టిన‌ పీ4 ప‌థ‌కం స్పూర్తిగా అవ‌కాశం ఉన్న అంద‌రూ స‌మాజానికి ఎంతో కొంత చేయాల‌న్నారు. 

తన విజ్ఞప్తి మేరకు చాలా మంది దాత‌లు సైకిళ్ల పంపిణీలో భాగ‌స్వాములు అయ్యార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ వివ‌రించారు. 

తాను కూడా కొన్ని మండ‌లాల్లోని పాఠ‌శాల విద్యార్థుల‌కు సొంత ఖ‌ర్చుతో సైకిళ్ల‌ను అందించిన‌ట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి నేత‌ల‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post