వడ్ల కల్లాలున్నా..... మేము ఆరబోసేది సిమెంట్ రోడ్లపై నే.
పట్టీ - పట్టనట్టు విహరిస్తున్న పంచాయతీ అధికారులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామపంచాయతీలో ప్రజా ప్రయోజనాల కోసం సిమెంట్ రోడ్డును వేయటం జరిగింది. సాయిబాబా గుడి దగ్గర సిమెంట్ రోడ్డు పై కొందరు రైతులు రోడ్డుపై వడ్లు వేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ రోడ్లపైనే వడ్లు ఆరబోస్తూ ఎండ పెట్టుకుంటున్న వైనం. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే సృహ లేకుండా వ్యవహరిస్తున్న రైతులు. ప్రజా ప్రయోజనాల కోసం సిమెంట్ రోడ్ వేసారాతప్ప వడ్ల అరబోసుకోటానికి కాదు,ఇప్పటికైనా స్థానిక పంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు ఆటంకం కలిగకుండా చూడాలని ప్రజలు ద్విచక్ర వాహనదారులు కోరుకుంటున్నారు.
