రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించాం.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.34 వేల కోట్లు అందిస్తున్నాం
అన్నదాత సుఖీభవతో రైతులను ఆదుకుంటున్నాం.
దీపం 2.0తో మహిళలకు ఉచిత సిలెండర్లు ఇస్తున్నాం.
తల్లికి వందనం ద్వారా విద్యార్ధులకు ఆర్ధిక సహకారం అందిస్తున్నాము.
సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమానంగా ఖర్చు చేస్తున్నాం.
2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
గోదావరి నుంచి నల్లమల సాగర్ అనుసంధానం ద్వారా నీళ్లు తెచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం
ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
ఈ ప్రాజెక్టు కోసం ఇంకా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
విద్యార్ధులకు ఆర్దిక సహకారం అందించాలి, రైతన్నను ఆదుకోవాలి, గిట్టుబాటు ధరలివ్వాలి ఇవన్నీ చేస్తూనే అభివృద్ధి వైపు కూడా దృష్టి పెట్టాం
గత ఏడాది హంద్రినీవాపై శ్రద్ధపెట్టి నీళ్లు తీసుకెళ్లాం. ఈ ఏడాది వెలిగొండపై దృష్టి పెట్టి నీళ్లు ఇస్తాం
రైతుల ఆదాయం పెంచాలి. దాని కోసం పుష్కలంగా నీరిచ్చి మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం
రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యాన పంటలతో అభివృద్ధి చేస్తున్నాం.
మార్కాపురం జిల్లాను ఉద్యాన వన పంటల కేంద్రంగాచేస్తాం.దానికి ప్రజలు నాకు సహకరించాలి
రూ.1300 కోట్ల ఖర్చు పెట్టి నల్లమల సాగర్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాం,
కొత్త జిల్లా ఇచ్చాం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.
మార్కాపురం జిల్లాలో భూ రికార్డుల సమస్య కూడా ఉంది. గత పాలకులు వివాదాలతో భూ కబ్జాలు చేశారు
ఇప్పుడు వివాదం లేకుండా ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నాం,
ఇప్పుడు సర్వే చేయించి రాజముద్రతో పాస్ పుస్తకాలు, రికార్డులు జారీ చేస్తున్నాం
క్యూఆర్ కోడ్ తో భూమి రికార్డులు అత్యంత భద్రంగా తయారు చేస్తున్నాం
సర్వేరాళ్లపై కూడా ఫోటోలు వేసుకున్నారు.
తప్పుడు రికార్డులు చేస్తే తాట తీస్తాం ,రూ.50 కోట్లతో మార్కాపురం జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నాం.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచటంతో పాటు మెరుగైన పాలన ఇస్తున్నాం.
రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.
మన యువత మన దగ్గరే ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
రాష్ట్ర చరిత్ర మార్చాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం
వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోకుండా భూగర్భజలాలు పెంచుతున్నాం.
గోదావరి నుంచి 6 వేలు, కృష్ణా నుంచి 15 వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది
వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం 53 టీఎంసీలు మాత్రమే.
జిల్లాలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందిస్తాం
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల ద్వారా పరిశుభ్రమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం
స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్ధాలను సేకరించి నిత్యావసర వస్తువులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం.
చెత్త నుంచి సంపద సృష్టిద్దాం. అన్నీ సద్వినియోగం చేసుకునే పరిస్థితి రావాలి
మార్కాపురం జిల్లాను సవాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తాం
10 లక్షల పేద కుటుంబాలను ఆదుకునేందుకు పీ4 కార్యక్రమం చేపట్టాం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టారు
కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి విక్రయించారు.
ఏ సంబందం లేని హెరిటేజ్ పై ఇప్పుడు నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అవినీతి పరులు బూతులు తిడితే పడాలా, నేను ఎవరినీ బూతులు తిట్టలేదు.
మరణించిన నా తల్లిని, నా శ్రీమతిని, మా పార్టీ నాయకులను బూతులు తిడుతున్నారు
అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా రాజకీయం చేస్తున్నారు,
2019-24 మధ్య రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. భయపెట్టారు. గంజాయి, భూముల కబ్జాలతో ఆరాచకం చేశారు
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటారు. కానీ ప్రజలు మద్దతు ఇవ్వకుండా అది ఎలా వస్తుంది,
ప్రజల ఓట్లతోనే నేను ముఖ్యమంత్రి అయ్యాను.
వారు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని బెదిరిస్తున్నారు.
నేను నిరంతరం ప్రజల కోసం రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాను వారి తిట్లను పట్టించుకోను.
తెలుగు జాతే నాకు ప్రాణం. వారి అభివృద్దే నా లక్ష్యం.
భవిష్యత్ తరం బాగుండాలనే విజన్ ప్రణాళికలు చేస్తున్నాను
బీసీలకు, ఎస్సీలకు న్యాయం చేయడానికి కేటగిరైజేషన్ తీసుకువచ్చాం.
లిడ్ క్యాప్ ద్వారా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నాం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను
పనులు చేసిన ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యత ప్రజలదే. మంచికి సహకరించేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోండి,నేను అందరివాడిగా ఉంటా ప్రజలందరికీ న్యాయం చేస్తాను.
నేను శంకుస్థాపన చేసిన వెలిగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి ప్రజల రుణం తీర్చుకుంటాను,దేవాలయాల పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టను, కుట్ర భగ్నం చేస్తానుఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్దం చేస్తాం చెత్త రాజకీయాలు, ఉత్తుత్తి రాజకీయాలు వద్దు, అభివృద్ధి రాజకీయాలే ముద్దు అన్నారు.
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే బాధ్యత మాది. దానిని వినియోగించుకునే బాధ్యతప్రజలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు,


