ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోస్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వి.బాలు కు ఘన సన్మానం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలనికి చెందిన. డా,, బాలుకు నూతన సంవత్సరములో. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా. డాక్టర్ బాలు గారు కొన్ని సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సహాయం గుర్తించి ఉమ్మడి ప్రకాశం కలెక్టర్ పి రాజాబాబు. మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు. చేతుల మీదుగా డాక్టర్ వి బాలు కు ఉత్తమ సేవా అవార్డు అందజేసిన సందర్భంగా . ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోస్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత డాక్టర్ బాలు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈరోజు బాలు గారు చేసిన సేవకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నూతనంగా జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా దళిత బహుజనలకు సేవ చేసిన డాక్టర్, వి బాలు గారి అవార్డు రావడం మన జిల్లాకే గర్వకారమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు మాట్లాడుతూ. అర్ధవీడు మండలంలో వివిధ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో గత 2000 సంవత్సరంలో త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాలలో డాక్టర్ బాలు గారు పర్యటించి వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో త్రాగునీటి బోర్లను వేయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బేస్తవారిపేట కంభం గిద్దలూరు రాచర్ల గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వివిధ మండలాల గ్రామాలలో కూడా దళిత గిరిజనులకు బహుజనులకు ఆయన సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు మరియు ఎన్నో బోర్లు వేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డా,,బాలు మాట్లాడుతూ గతంలో బెస్తరాపేట మండలంలోని పిటకాయ గుల్ల చెరువు తెగడం వలన మా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమం చేశామని అలాగే కరోనా సమయంలో కరోనాకు భయపడకుండా మేము మా టీం అందరం కలిసి ప్రజలకు కావలసిన అవసరతలు నిత్యవసర సరుకులు మా సంస్థ తరఫున అందించామని తెలియజేశారు. చేసిన సేవలను గుర్తించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండుసార్లు ఉత్తమ సేవ అవార్డులు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నామని తెలిపారు.
అలాగే నూతన సంవత్సరములో నూతన మార్కాపురం జిల్లాలో మొట్టమొదటిగా గణతంత్ర దినోత్సవం రోజున జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ చేతుల మీదుగా మొట్ట మొదటిగా అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోస్ ఫెడరేషన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ఎన్జీవోస్ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్. గూడూరి అన్నోజి రావు. చిట్లూరి ఏలియా . దున్న యోబు. దారివేముల.లూకా అనిల్. బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరియోబు. గురవయ్య. జయరావు. బాబురావు. పర్శపోగు మనోజ్. గంటె పోగు. సామేలు, పాల్. మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు. దేవి రెడ్డి.నాగేంద్రుడు. మాజీ cto ప్రసాద్. వివిధ మహిళ ఎన్జీవోస్ పాల్గొని. డాక్టర్ వి,బాలును ఘనంగా సన్మానించడం జరిగింది.
.jpg)
