రాంబిల్లి మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.


రాంబిల్లి మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

అనకాపల్లి(రాంబిల్లి)ఫిబ్రవరి :15.

 ​రాంబిల్లి ఎస్.హెచ్.ఓ సిహెచ్.నరసింగరావు కి అందిన ముందస్తు సమాచారం మేరకు, ఎస్సై డి.నాగేంద్ర తమ సిబ్బందితో కలిసి మండలంలోని పి.కె.పల్లి గ్రామ శివారులో మెరుపు దాడి నిర్వహించారు.

​ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న ఏడుగురు (07) వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2,050/- నగదును మరియు పేకాట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

​ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, జూదం వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post