తెలుగు ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు - ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.


 తెలుగు ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు - ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు, ఫిబ్రవరి 15:- ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, సోదర సోదరీ మణులకు, కార్మిక, కర్షక శ్రామిక వర్గాలకు, పెన్షనర్లకు, రైతు సోదరులకు, వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు, అందరికీ మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. "ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనను అందిస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు  పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, పౌర సరఫరాల మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ కి, జనసేన, తెలుగుదేశం బిజెపి కూటమి పార్టీల నాయకులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు, మెగా అభిమానులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నామన్నారు.  ఏలూరులో మంచి పరిపాలనను అందిస్తున్న ఏలూరు పార్లమెంటు సభ్యులు  పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి, ఏలూరు ఎమ్మెల్యే  బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు కి, జిల్లా కలెక్టర్కి, డిప్యూటీ కలెక్టర్ కి, పోలీసు అధికారులకు, రెవెన్యూ అధికారులకు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, ఏపీఎస్ పీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరికీ పేరుపేరునా మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో మీరు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం అవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుడిని కోరుకుంటున్నామని అన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post