పాకాల బీచ్ ను సందర్శించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల రాష్ట్రంలో 100 ప్రముఖ పర్యాటక బీచ్ ల్లో పాకల బీచ్ ఒకటిగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు, ఈ నెల 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు పాకల బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.సింగరాయకొండ మండలం, పాకల బీచ్ లో ఈ నెల 14, 15 తేదేల్లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం ఉదయం మంత్రి డా. డోలా. బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ గార్లతో కలసి ఏవీ ని విడుదల చేసిన అనంతరం బీచ్ లో పారిశుద్ధ్య పనుల్లో స్వయంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి డా,డోలా.బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, 2014-19 మధ్య కాలంలో విశాఖపట్నం బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆ బీచ్ లో వున్న విధంగా పారమిట్ వాల్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అప్పటి జిల్లా కలెక్టర్ తో చర్చించి నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 100 ప్రముఖ పర్యాటక బీచ్ ల్లో పాకల బీచ్ ఒకటిగా అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రాంతంగా పాకల బీచ్ ను కూడా గుర్తించి యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పాకల బీచ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రోమో గా వాడుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే పాకల బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడింగ్, బోట్ రైడింగ్, పారా రైడింగ్, బీచ్ వాలీ బాల్, బీచ్ కబడీ వంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ బీచ్ ను అభివృద్ధి చేసిన తర్వాత జిల్లాలోని అన్నీ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడం జరుగుచున్నదన్నారు. గత నెల సంక్రాంతి సమయంలో రోజుకు సుమారు 10 వేల మంది వరకు ఈ పాకల బీచ్ కు రావడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఈ బీచ్లో బే వాచ్ టవర్ ను ఏర్పాటు చేసి వచ్చే సందర్శకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వలన ఈ సంవత్సరం ఒక్క మరణం కూడా సంభవించలేదని మంత్రి గుర్తు చేశారు. అత్యంత సురక్షిత బీచ్ గా పాకల బీచ్ ను అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ప్రాముఖ్యత ను తెలియ చేసే కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిచే 9వ తేదీఒంగోలులో కర్టన్ రైజర్ ప్రోగ్రాం, అలాగే 10వ తేదిన సంభందిత శాసన సభ్యుల ఆధ్వర్యంలో కందుకూరు, కనిగిరి, పొదిలి లో 2కె రన్ నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు. 14వ తేదీ ఉదయంన పాకల బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించు కోవడం జరుగుతుందన్నారు.
పాకల బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా నిర్వహించేలా అన్నీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా ప్రజలు కుటుంబ సమేతంగా ఈ బీచ్ ఫెస్టివల్ కు హాజరై సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా మంత్రి ప్రజలను కోరారు. జిల్లా కలెక్టర్. పి రాజాబాబు మాట్లాడుతూ, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పాకల బేచ్ ఫెస్టివల్ సందర్భంగా కర్టన్ రైజర్గా రూపొందించిన వీడియో ప్రోమో ను ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
పర్యాటక బీచ్ గా పాకల బీచ్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు బీచ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. బీచ్ ను ఒకసారి అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పిస్తే ప్రజలంతా బీచ్ ను సందర్శించి ఎంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారన్నారు. ఈ పాకల బీచ్ లోతు తక్కువతో సురక్షిత బీచ్ అని కలెక్టర్ తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్ లో సందర్శకులను అలరించే, ఉత్సాహ పరిచే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, వాటర్, బీచ్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ప్రజలు ఈ బీచ్ ఫెస్టివల్ కు హాజరై సంతోషంగా గడపాలని కోరారు.ఏపి మారి టైమ్ బోర్డు ఛైర్మన్.దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 14, 15న రెండు రోజుల పాటు నిర్వహించే పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా స్వచ్ఛ పాకల కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని వివిధ కళాశాల విద్యార్థులను భాగస్వాములు చేసి బీచ్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రకాశం జిల్లా లో పర్యాటకంగా మంచి అనుకూలమైన బీచ్ పాకల బీచ్ అని అన్నారు. జిల్లా లోని అన్నీ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఈ పాకల బీచ్ ఫెస్టివల్ ల్లో పాల్గొనాలని ఆయన ప్రజలను కోరారు.
ఏపి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ, భవిష్యత్ లో పాకల బీచ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన మొదటి పది బీచ్ లో పాకల బీచ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి,నారా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పాకల బీచ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.అనంతరం పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార వాహనాలను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక వ్యవహారాలశాఖసంచాలకులు.
మల్లికార్జున రావు, పర్యాటక శాఖ మేనేజర్ శ్రీ నాంచారయ్య, ఆర్ డి ఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, పాకల గ్రామ సర్పంచ్ శేఖర్, వివిధ శాఖల అధికారులు తదతరులు పాల్గొన్నారు,


