కంభం లో వైఎస్సార్ పార్టీ ఆత్మీయ సమావేశం.



కంభం లో వైఎస్సార్ పార్టీ ఆత్మీయ సమావేశం.

రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌నన్న ను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, కుందూరు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంఘనంగానిర్వహించారు,

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని పేర్కొన్నారు. 

పేదల సంక్షేమం, రైతుల భరోసా, మహిళల సాధికారతే లక్ష్యంగా జగన్ పాలన సాగిందన్నారు. 

రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మరింత చురుకుగా పని చేయాలని సూచించారు. 

గ్రామ గ్రామానపార్టీకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ పార్టీ నాయకులు నీమీలిదిన్నె చెన్నారెడ్డి, కంభం మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post