జిల్లాలో అంగన్వాడీ లందరిని ఈ ఎస్ ఐ పధకంలో చేర్చాలి IFTU విన్నపం.




 జిల్లాలోని అంగన్వాడీలందర్నీ ఈఎస్ఐ పథకంలో చేర్చాలి --- ఐ.ఎఫ్.టి.యు విన్నపం.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

జిల్లాలోని అంగన్వాడీలందరినీ ఈఎస్ఐ--స్ప్రీ (ESI--SPREE)పథకంలో చేర్చి ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా) పథకం అమలు చేయాలని ఏ.పీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్& హెల్పర్స్ యూనియన్(IFTU)జిల్లా కమిటీ నేడు జిల్లా జాయింట్ కలెక్టర్  అభిషేక్ గౌడ్ కి స్పందన కార్యక్రమంలో వందలాది సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్  డిప్యూటీ లేబర్ కమిషనర్(DCL) మరియు ఐసిడిఎస్ పి.డీ లకు అంగన్వాడీలను ఈఎస్ఐ స్ప్రీ పథకంలో చేర్చి ఈఎస్ఐ ప్రయోజనాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ.పీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్(ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు జిల్లా జాయింట్ కలెక్టర్  అభిషేక్ గౌడ్ ని కలిసి ఈఎస్ఐ స్ప్రీ పథకంలో అంగన్వాడీలను చేర్చి, అంగన్వాడీలకు ఈఎస్ఐ సౌకర్యం అమలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. జిల్లాలో ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు,మినీ వర్కర్లు 4 వేలకు పైగా ఉన్నారని, వీరందరికీ 21 వేల రూపాయల లోపు వేతనమే ఉందని, వీరంతా ఈఎస్ఐ ప్రయోజనం పొందేందుకు అర్హులని, వీరందరికీ ఈఎస్ఐ సౌకర్యము అమలుకు చర్యలు తీసుకోవాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అనేక అనారోగ్యాల పాలై, చాలీచాలని వేతనాలలో సగం జీతం వైద్యం కోసం ఖర్చు చేసుకుంటున్నారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈఎస్ఐ స్ప్రీ పథకంలో అంగన్వాడీలను చేర్చి అంగన్వాడీలకు ఈఎస్ఐ సౌకర్యాల అమలు కోసం చర్యలు తీసుకోవాలని వారు ఆ వినతి పత్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరారు. దానిపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను, కార్మిక శాఖ అధికారులను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే.వి.రమణ, అధ్యక్షురాలు కే.విజయలక్ష్మి,జిల్లా నాయకులు మారెమ్మ ,ఆకాశ, పద్మ మరియు ఐ.ఎఫ్.టి.యు ఏలూరు నగర అధ్యక్షులు బి. సోమయ్య, ఆఫీసు బేరర్లు కె.రామలక్ష్మి,డి.రత్నబాబులు ఉన్నారు.ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల లోపు ఆదాయం కల ఉద్యోగులు, కార్మికులందరినీ ఈనెల 31 లోపు ఈఎస్ఐ పథకంలో చేర్చాలని ప్రత్యేక కార్యక్రమం రూపొందించిందని, ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా జిల్లాలోగల 4 వేలకు పైగా గల అంగన్వాడీలందరినీ ఈఎస్ఐ పథకంలో చేర్చాలని వారు జిల్లా అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.ఈఎస్ఐ పథకంలో అంగన్వాడీలను చేర్చినట్లయితే అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లకు,మినీ వర్కర్లకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఉచిత వైద్యం లభిస్తుందని, భీమా సౌకర్యం లభిస్తుందని, 50 లక్షల రూపాయల విలువైన వైద్యం వరకు ఉచితంగా సేవలు పొందవచ్చని వారు తెలిపారు. ఈఎస్ఐ పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపజేసి వారి ఆరోగ్య రక్షణకు, బీమా సౌకర్యాల కోసం జిల్లా అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు.

 

Post a Comment

Previous Post Next Post