నూతనంగా ఏర్పాటు కాబడిన మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో 5వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ నిర్వహణ.


 నూతనంగా ఏర్పాటు కాబడిన మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో   5వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ నిర్వహణ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మర్కాపురం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ఇంచార్జి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.

మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇంచార్జి జిల్లా కలెక్టర్.పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

 మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజక వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.

జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాల్లో రెవెన్యూ సిబ్బంది హాజరగు చున్నందున ఈ నెల 5వ తేదీన జరగవలసిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని, 

పిజిఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post