యోగి వేమన జయంతి వేడుకలు - చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, జనవరి 19: ప్రజా కవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వేమన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
వేమన తన పద్యాల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలి, మానవతా విలువలను చాటిచెప్పారని కొనియాడారు.
అతి సామాన్యమైన భాషలో గంభీరమైన జీవిత సత్యాలను బోధించిన గొప్ప దార్శనికుడు వేమన అని పేర్కొన్నారు.
వేమన అందించిన సందేశాలు నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, రమేష్, ఎస్సైలు రమణయ్య, ప్రసాద్, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని యోగి వేమనకు నివాళులర్పించారు.

