ఘనంగా వివేకానంద జయంతి నిర్వహించిన బీజేపీ నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ భారతీయ జనతా పార్టీ
అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం జరిగింది,
ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ జె వి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని వివేకానంద కాలనీ లో
ఆధ్యాత్మక విశ్వ గురువు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు, సీనియర్ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, మాజీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షైక్ ఖాదర్ వలి షఫీ, మాజీ ఎస్ సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య, బాదుల్ల, శివాపురం రవికుమార్, వీర చక్రం కొప్పుల నరసింహులు, పీరయ్య, జనార్దన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జె వి నారాయణ మాట్లాడుతూ ఆధ్యాత్మికత ను ప్రపంచానికి పరిచయము చేసిన గొప్ప వారు స్వామి వివేకానంద సూచించిన ఆశయాల ను యువత ఆచరించాలని తెలియ చేయడము జరిగింది.
