ఏలూరు లో పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమన్ని ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు, దాసరి ఆంజనేయులు.


 ఏలూరు లో పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమన్ని ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు, దాసరి ఆంజనేయులు.

5 వ డివిజన్ చెంచులకాలనీలోని బూత్ నెంబర్ 8 నందు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ.

ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు, దాసరి ఆంజనేయులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు, డిసెంబర్ 21:- పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.. దీనిలో భాగంగా స్థానిక 5 వ డివిజన్ చెంచులకాలనీ లోని బూత్ నెంబర్ 8లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర మాలల కార్పోరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల సహకారం, అవగాహణ అత్యంత అవసరమని తెలిపారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంటూ, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెంచులకాలనీలోని 8 వ నెంబరు బూత్ లో ఈరోజు సుమారు 166 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా ఆయన తెలిపారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని సంకల్పంతో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందన్నారు. 

రాష్ట్ర మాలల కార్పోరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ పల్స్ పోలియో శిబిరాలలో ఐదు సంవత్సరాల వయసులోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్య సిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post