కంభంలో ఘనంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు.
( దాసరి యోబు. ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.)
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల కేంద్రంలోని కాపవీధిలో వైయస్సార్సీపి శ్రేణుల ఆధ్వర్యంలో
పేదలపాటి పెన్నిధి వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కుందూర్ నాగార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 వ సంవత్సరంలో జగనన్న ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
జగనన్న ముఖ్యమంత్రి అయితే పేదల జీవితంలో వెలుగు నింపుతాడని ఆయన అన్నారు. వైసిపి కుటుంబంలో కష్టపడే ప్రతి కార్యకర్త సమన్వయం పాటించాలని ఆయన అన్నారు. 2029లో మన జగనన్న ముఖ్యమంత్రి అని కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.
ఈ జన్మదినం వేడుకలో కంభం మండల వైయస్సార్ సిపి నాయకులు స్థానిక సర్పంచులు వైఎస్సార్సీపి కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
