ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బడేటి చంటి నియామకం. శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి అప్పల నాయుడు.



 ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బడేటి చంటి నియామకం.

శుభాకాంక్షలు తెలిపిన రెడ్డి అప్పల నాయుడు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. శరత్.

ఏలూరు, డిసెంబర్ 18:- ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన సోదరుడు బడేటి రాధాకృష్ణ (చంటి) గారికి ఏలూరు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరినీ కలుపుకుని పోయె మంచి మనిషి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్న ఎమ్మెల్యే చంటి గారికి జిల్లా అధ్యక్ష పదవి రావడం శుభ పరిణామం. కూటమి బలంగా ముందుకు సాగడానికి, అందర్నీ సమన్వయ పరుస్తూ, ఎటువంటి విభేదాలకు తావు లేకుండా, ఏలూరులో చాలా మంచి ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, జిల్లా అభివృద్ధి చెందాలన్న, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న అందరూ కలిసికట్టుగా పనిచేసి, నగరంలో అభివృద్ధిని అందించాల్సిన బాధ్యత కూటమి నాయకులు అందరిపై ఉందన్నారు. స్వతహాగానే మంచి పరిపాలనను అందిస్తున్న ఎమ్మెల్యే చంటి గారు మంచి ఆలోచనపరుడు, శాంతియుతంగా అందరితో మాట్లాడి, ప్రతి ఒక్కరినే కలుపుకుని వెళ్లే వ్యక్తి, అటువంటి మంచి వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి రావడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు. చంటి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని  ఆకాంక్షిస్తూ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ , జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, దోసపర్తి రాజు, కూని శెట్టి మురళి కృష్ణ, గొడవర్తి నవీన్, ఎట్రించి ధర్మేంద్ర,  జనసేన రవి, వాసా సాయి కుమార్, బుధ్ధా నాగేశ్వరరావు, జనపరెడ్డి తేజ ప్రవీణ్, రాపర్తి సూర్య నారాయణ, నాగదేవ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post