ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో ఏసీబీ DSP గా బాధ్యతలు స్వీకరించిన -జి.వి. కృష్ణారావు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు,డిశంబరు,18: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా జి.వి. కృష్ణారావు ది.17.12.2025 ఏలూరు లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఎస్‌ఐ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పనిచేశారు. తదనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పెరవలి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. తరువాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోలోపనిచేశారు. 2020 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో డిఎస్పీగా పనిచేసి తరువాత పాలకొండ SDPO గా, APSP 8th బెటాలియన్ లో DSP గాపనిచేసి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా, ఏలూరు కార్యాలయములో బాధ్యతలు స్వీకరించినారు. అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయముగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని కోరినారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అంతే కాకుండా DSP గారి మొబైల్ నెంబర్ 9440441657 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేసినారు.
Add

