ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న APSRTC.


 #Breaking News...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న APSRTC.

పార్సిల్స్ రూపంలో పొంచిన్న ప్రమాదం.

నిర్లక్ష్య ధోరణిలో -ఏలూరు DPTO.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు జిల్లా.

   APSRTC లో భద్రత లోపించింది అనడానికి నిదర్శనం -పార్సిల్.

 కార్గో పార్సిల్ సర్వీసెస్ నిర్వహిస్తున్న RTC ఆధాయాల వైపు చూసుకుంటుంది గాని, ప్రజల ప్రాణాలకి పొంచిఉన్న ప్రమాదాలపై ద్రుష్టి పెట్టడంలో విఫలం చెందిన్ది అనడానికి... నిలువెత్తు నిదర్శనం APSRTC ఏలూరు DPTO నిర్లక్ష్య సమాధానం. APSRTC కార్గో పార్సెల్ సర్వీస్ ద్వారా అనేక ఇతర ప్రాంతాలనుండి పార్సిల్ రావడం వెళ్ళడం జరుగుతున్న నేపథ్యంలో పార్సిల్ బుకింగ్ చేసే సమయంలో తనిఖీలు సూన్యం. పార్సిల్స్ బుకింగ్ చేసే సందర్బములో కస్టమర్స్ తీసుకువచ్చే సీల్డ్ ప్యాకింగ్ పార్సిల్స్ కనీసం ఓపెన్ చెయ్యకుండా... కస్టమర్ చెప్పే గుడ్డి సమాధానం ఆధారంగా పార్సిల్స్ బుకింగ్ చెయ్యడం ద్వారా అందులో ప్రమాదకరమైన నిషేదిత పేలుడు పదార్ధాలు ఉన్నాయో లేవో పూర్తి స్థాయిలో తనిఖీ చెయకుండా ధనార్జనే ద్యేయంగా.. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయానే ఆలోచన లేకుండా వ్యవహారిసున్నారు.. ఈమధ్య దీపావళి సమయంలో పార్వతీపురం డిపోలో జరిగిన సంఘటన లాంటివి దృష్టిలో పెట్టుకొని ఏలూరు జిల్లా స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఏలూరు DPTO ని ప్రశ్నిస్తే... మేము వారానికి ఒక్కసారి డాగ్స్ టీం తో చెక్ చేస్తున్నాము అనడం హాస్యాస్పద్ధంగా ఉంది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాయిస్టులపై ఆపరేషన్ ఖగార్ నిర్వహిస్తున్న తరుణంలో మావోయిస్టులు అరణ్యాన్ని వీడి జనావాసల్లో స్థావారం ఏర్పాటు చేసుకుంటున్నతరుణం ఇది.. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఈ మధ్యకాలంలో ఏలూరులో గ్రీన్ సిటీ లో పోలీసులకు పట్టుబడ్డ సాయుధ మావోయిస్టులు... ఆ సంఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఎక్కడో అడవుల్లో ఉండే మావోయిస్టులు జనవాసాల్లో స్తావరాలు ఏర్పారుచుకుంటుంటే.. ప్రజల భద్రత కాపాడడం కేవలం పోలీసుల బాధ్యతే కాదు... ఇలాంటి పార్సిల్స్ ప్రతి వక్కటి పూర్తి స్థాయిలో పరిశీలించే విధంగా చర్యలు తీసుకొనే భాద్యత స్థానిక APSRTC ది. ఇకపైన అధికారులు మేలుకొని పార్సిల్స్ పై క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తారో లేక భద్రతా నియమాలు కేవలం బోర్డు లకే పరిమితం చేస్తారో... వేచి చూడాలి.

Add


Post a Comment

Previous Post Next Post