రైల్వే మంత్రికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి.

రైల్వే మంత్రికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి. 

భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్, ఆర్వోబీ లను త్వరగా పూర్తి చేయండి.. రైల్వే మంత్రికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి. 

‎కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఏలూరు ఎంపీ.

 భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులు త్వరగా మొదలుపెట్టాలని విజ్ఞప్తి.

 100 శాతం రైల్వే నిధులు కేటాయించాలని కోరిన ఎంపీ.

 11 ఆర్వోబీ లకు అనుమతులు వచ్చినా పనుల మొదలుకాని విషయం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ.

‎ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 03: హైదరాబాద్, విశాఖ మధ్య దాదాపు 150 కిలోమీటర్ల దూరం తగ్గించి, నాలుగు ఎస్సి అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు ఎస్టి అసెంబ్లీ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ వెళ్లే అత్యంత ముఖ్యమైన భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ, భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ కు సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని అధికారులు చెబుతున్నారని, దానిపై త్వరగానే నిర్ణయం తీసుకొని పనులు వెంటనే మొదలుపెట్టే విధంగా రైల్వే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఒక లేఖను కేంద్ర మంత్రికి అందించారు. 

‎ఈ రైల్వే లైన్ కోసం అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్ధిక వనరులు తక్కువగా ఉన్న కారణంగా 100 శాతం రైల్వే నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని గతంలోనే కోరిన విషయాన్ని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన లేఖలో గుర్తుచేశారు.అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన 11 ఆర్వోబీ/ ఆర్యూబీల  పనులను కూడా త్వరగా మొదలు పెట్టాలని కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు మరో లేఖ అందించారు. ఎంపీ కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో.. భీమడోలు (LC 361),  కైకరం(LC 364), చేబ్రోలు(LC 365), ఉంగుటూరు (LC 366), ఏలూరు పవర్ పేట (LC 347), పంగిడిగూడెం (LC 352, 354), సీతంపేట(LC 355), పూళ్ల (LC 363b) బాదంపూడి (LC 369) ఉన్నాయి. ఈ రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీలతో పాటు, వట్లూరు గేట్ సమీపంలో అండర్ పాస్ లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వట్లూరు, సౌరిపురం, హౌసింగ్ బోర్డు కాలనీల ప్రజలు, సమీప కాలేజీల విద్యార్ధుల విజ్ఞప్తి మేరకు ఆర్యూబీ నిర్మాణం కూడా త్వరగా చేపట్టాలని ఎంపీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్వోబీల విషయాన్ని గతంలో అనేకసార్లు  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని కూడా ఎంపీ తన లేఖలో గుర్తు చేశారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఆర్వోబీలకు సంబంధించి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు  ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో, రైల్వే అధికారులతో సంయుక్త సమావేశాలు కూడా జరిగాయని, ఇటీవల క్షేత్ర స్థాయి పరిశీలన కూడా జరిగిందని ఎంపీ వెల్లడించారు. అయినప్పటికీ పనులు మొదలు పెట్టడం ఆలస్యం అవుతున్న కారణంగా మరోసారి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకు వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ ఆర్వోబీల పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాల్సిందిగా తన లేఖలలో కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

 

Post a Comment

Previous Post Next Post