ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ గారి 69 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్ 06 :- ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఆశయాలను భావితరాలవారు ముందుకు తీసుకెళ్ళాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి,ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు.. శనివారం ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 69 వ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతిని మరింత పెంచిన దిట్ట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేటికి అనేక మంది పేద ప్రజలను సుస్థిరత వైపుగా నడిపిస్తోందన్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకమే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గొప్ప బలమైన రాజ్యాంగ విధమైన పాలనను ప్రవేశపెట్టిన వ్యక్తని, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ వ్యవస్థలను, ఆయన నిర్మించిన ప్రభుత్వ వ్యవస్థలను ఎలా నడపాలో నిర్మించిన మహోన్నత వ్యక్తి కి ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరి తరపున నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షులు వీరంకి పండు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, పైడి లక్ష్మణరావు, నూకల సాయి, గొడవర్తి నవీన్, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు..
