ఏలూరు జిల్లా డీఈఓ నీ తక్షణమే సస్పెండ్ చేయాలి- ఏఐఎస్ఎఫ్ డిమాండ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు: స్థానిక ఏలూరు 1టౌన్ పరిధిలో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ అనే విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆదివారం సెలవు రోజున కూడా తరగతులు నిర్వహిస్తున్నారని, విద్యార్థినిలు ఏఐఎస్ఎఫ్ నాయకులకు తెలియపరచగా, ఏలూరు లో ఉన్న 1టౌన్ పరిధిలో ఉన్న కేంబ్రిడ్జ్ విద్యసంస్థకు వెళ్లినటువంటి ఏఐఎస్ఎఫ్, నాయకులను అసభ్య భావజాలంతో మాట్లాడుతూ, మాకు జిల్లా విద్యాశాఖ అధికారులు సహకారం ఉంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోమంటూ, కేంబ్రిడ్జ్ విద్య సంస్థ చైర్మన్ మాట్లాడుతున్నారని, ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ తెలిపారు.
కేంబ్రిడ్జ్ విద్యాసంస్థకు అసలు ఒక పక్క state సిల్వస్ ఉంది అంటూ ఇంకో పక్క CBSC, సిల్వస్ ఉంది అంటూ విద్యార్థులు తల్లితండ్రులను నమ్మిస్తూ విద్యార్థుల తల్లితండ్రుల దెగ్గర అధిక ఫిజులు వసూలు చేస్తున్నరు, అసలు ఎక్కడ లేని విధంగా ఒకే స్కూల్ కి రెండు బోర్డ్స్ కి హనుమతులు ఎలా జిల్లా విద్యాశాఖ అధికారి DEO ఇస్తారు, ఎందుకు అంత అనుకూలంగా ఉన్నారు, అక్కడ జరుగుతున్న మోసలపై ఎందుకు స్పందించడం లేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేసారు,
