పోలీసు శాఖకు హోం గార్డ్స్ సేవలు వెన్నెముక” – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
63వ హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం అనకాపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహణ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, డిసెంబర్ :06
63వ హోం గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఈ వేడుకలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ హోం గార్డ్స్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్‌ను పరిశీలించారు. హోం గార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
ఆవిర్భావ చరిత్ర & సేవా స్పూర్తి.
హోం గార్డ్స్ వ్యవస్థ 1962 డిసెంబర్ 6న స్థాపించబడింది.స్వచ్ఛంద సేవాస్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ, నేటికీ ప్రజా భద్రతలో కీలక భూమిక పోషిస్తోంది.శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేరాల నివారణ, రెగ్యులర్ పోలీస్ విధులలో హోం గార్డ్స్ పోలీసులకు వెన్నెముకలాగా నిలుస్తున్నారు.
అనకాపల్లి – అల్లూరి సీతారామరాజు జిల్లాల హోం గార్డ్స్ బలం. జిల్లాలలో మొత్తం 667 మంది హోం గార్డ్స్, అందులో 93 మంది మహిళా హోం గార్డ్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
హోం గార్డ్స్ కీలక పాత్రలు: ట్రాఫిక్ నియంత్రణ,డ్రైవింగ్, కంప్యూటర్ ఆపరేటర్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, క్రైమ్ డిటెక్షన్ సహాయం.
ప్రజా సేవా కార్యక్రమాలు.
మహిళా హోం గార్డ్స్ మహిళా, బాలల సంబంధిత కేసుల్లో కౌన్సెలింగ్, లీగల్ అవగాహన, శాంతిభద్రతల నిర్వహణలో విశేష సేవలు అందిస్తున్నారు.
ఇతర శాఖలకు హోం గార్డ్స్ సేవలు.
హోం గార్డ్స్ పోలీసులు మాత్రమే కాదు, అనేక శాఖల్లో కూడా విశేష సేవలు అందిస్తున్నారు:
విజిలెన్స్, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఫైర్ సర్వీసెస్, సబ్ జైల్‌లు, ఆర్ఎంటీ/ రోడ్డు రవాణా శాఖ,దేవస్థానాలు తదితరవారి కృషి పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతోందని ఎస్పీ అభినందించారు.
హోం గార్డ్స్ సంక్షేమ చర్యలు.
ప్రస్తుత హానరేరియం రోజుకు రూ.710.
పోలీస్ రిక్రూట్మెంట్‌లో 25% రిజర్వేషన్ హోం గార్డ్స్‌కు కొనసాగుతోంది.
విధి నిర్వహణలో ప్రమాదాలు/మరణాలు సంభవించినప్పుడు:
వెంటనే రూ.15,000 –20,000 వెల్ఫేర్ సహాయం, అదనంగా 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రధాని జనధన్ బీమా, యాక్సిడెంట్/లైఫ్ ఇన్సూరెన్స్‌కు అందరూ నమోదు కావాలని ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.
ఆరోగ్య పరిరక్షణ:
ఇటీవలి ఆరోగ్య శిబిరాల్లో 300కి పైగా హోం గార్డ్స్‌కు హెల్త్ చెక్-అప్ నిర్వహించామని, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
డిసిప్లిన్ – టెక్నాలజీ – భవిష్యత్ పోలీసింగ్.
హోం గార్డ్స్ సివిల్ పోలీసుల్లాగే సమానంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారని ఎస్పీ అభినందించారు.
ఈసాక్ష్య, ఐసీజేఎస్ డాష్‌బోర్డ్, న్యూ క్రిమినల్ లాస్ యాప్‌లు, మొబైల్/సిస్టమ్ ఆపరేషన్స్ వంటి రంగాల్లో హోం గార్డ్స్ నేర్చుకుని స్టేషన్లలో కీలక పనులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇంకా కంప్యూటర్ పరిజ్ఞానం లేని హోం గార్డ్స్ తప్పనిసరిగా డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.
టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌లో హోం గార్డ్స్ పాత్ర భవిష్యత్తులో మరింత కీలకం కానుందని ఎస్పీ స్పష్టం చేశారు.
ఒక రోజు వేతనం – మహోన్నత సేవ.
మరణించిన/పదవీ విరమణ పొందిన హోం గార్డ్స్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు, జిల్లాలోని హోం గార్డ్స్ అందరూ తమ వేతనం నుండి ఒక రోజు వేతనం స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయం అని ఎస్పీ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ప్రతిభావంతుల సత్కారం పరేడ్, టర్నవుట్, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హోం గార్డ్స్‌కు ఎస్పీ చేతుల మీదుగా:
ప్రశంసా పత్రాలు,నగదు రివార్డులు ప్రదానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, సబ్ డివిజన్ డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, కృష్ణ చైతన్య(ట్రైనీ), ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, రమేష్, ప్రేమ్ కుమార్, స్వామి నాయుడు, అశోక్ కుమార్, ఏ.ఆర్ ఆర్‌ఐ లు రమణమూర్తి, రామకృష్ణారావు, మన్మధ రావు, సంజీవ రావు, జిల్లా హోం గార్డ్స్ ఇన్చార్జులు నర్సింగరావు, చిన్నారావు, ఏ.ఆర్ సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

