నామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న చెక్‌డ్యామ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.
క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజక వర్గం ఇంచార్జ్. బి అమృతరాజ్.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం, బెస్తవారిపేట మండలం, పుసలపాడు గ్రామంలోని వ్యవసాయ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. చెక్ డ్యామ్ భూమి పూజ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.
ముఖ్య అతిధిగా పాల్గోని భూమిపూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ "నామ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, బాలీవుడ్ నటుడు శ్రీ నానా పాటేకర్, గ్రామీణాభివృద్ధి మరియు జల వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు, స్థానిక వ్యవసాయం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్బంగా నానా ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గ్రామ రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన "నామ్ ఫౌండేషన్" కు మరియు పుసలపాడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గౌ. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారికి ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చెక్‌డ్యామ్ పూర్తయ్యిన వెంటనే నీటి నిల్వ, సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు మేలు కలగనుంది.

