అనాధ బాలికలకుహెల్త్ కార్డులు అందజేసిన కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి. దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మరియు గిద్దలూరులో ని బాల సదన్ లో నమోదుచేసుకున్న అనాధ బాలికలకు అమృత హెల్త్ స్కీం ద్వారా ప్రైవేట్ ఎన్టీఆర్ వైద్యసేవ కలిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ నందు ఉచితంగా వైద్యసేవలు పొందడానికి తగిన హెల్త్ కార్డులను సోమవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా అందచేశారు. బాల సదన్ నిర్వాహకులు ఈ బాలికలలో ఏదయినా అనారోగ్య సమస్యలు గుర్తుంచినట్లయితే వెంటనే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు చూపించి తగిన వైద్యం ఉచితంగా పొందవలసిందిగా జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ హేమంత్, ఐ సి డి ఎస్ పీడీ.శ్రీమతి సువర్ణ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీ దినేష్ కుమార్, బాలసదన్ నిర్వాహకులు , బాలికలు తదితరులు పాల్గొన్నారు.

