అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ - ఏలూరు MLA బడేటి రాధా కృష్ణయ్యా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్ - 17. కూటమి ప్రభుత్వానికి మరింత మంచిపేరు తీసుకొచ్చే విధంగా అంగన్‌వాడీలు సమర్థవంతంగా పనిచేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. దానిలో భాగంగా వారు మరింత మెరుగైన పనితీరు చూపాలనే అభిలాషతోనే 5జి స్మార్ట్‌ఫోన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 5జీ స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే చంటి అంగన్‌వాడీ కార్యకర్తలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పరిధిలోని 195 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం కార్యదక్షతకు ఇది నిదర్శనమని, వ్యవస్థల్లో మెరుగైన పనితీరు కోసం అవసరమైన అధునాతన విధనాలను అందుబాటులో తీసుకొస్తున్నామన్నారు. త్వరలోనే అంగన్‌వాడీల కష్టానికి తగిన గుర్తింపునిచ్చే విధంగా వేతనపెంపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న ఆయన,,, ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని, సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఏలూరు సిడిపివో ఎ. పద్మావతి, సూపర్‌వైజర్‌లు బి. మంగ, కె. సత్యనారాయణమ్మ, టి. జోషి, ఎమ్. మీనాక్షి, రాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Add

