ఒంగోలు పర్యటించిన క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు.


 ఒంగోలు పర్యటించిన క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్ద ఛైర్మన్ ఏ.రవినాయుడు అన్నారు. క్రీడాప్రాధికార సంస్ద ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఒంగోలులోని పి.ఆనంద్ ఇండోర్ స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ, 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకువచ్చి రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తోందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 421 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఫెన్సింగ్ అసోసియేషన్ కు గుర్తింపు లేదని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post