లింగోజిపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ముత్తుముల్ల.
సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే,
క్రైమ్ 9 గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్ అమృత రాజు.
ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
సంక్షోభంలోనూ ప్రజలకు, సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి,ప్రజలకు వివరించారు.
ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కంభం మండలం, లింగోజీపల్లె గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఇంటింటికీ తిరిగి, లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు. గత 5 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని, రూ.1000/- పెంచేందుకు జగన్ రెడ్డికి నాలుగేళ్లు పట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో రూ.1000/- పెంచిన ఘనత చంద్రబాబు గారిదేనని, ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ. 15 వేలు పంపిణీ చేస్తూ దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతి పెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. పేదలకు సేవా చేయటమే తమ లక్ష్యమని, ఇది పేదల ప్రభుత్వమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి ప్రభుత్వంకూటమిప్రభుత్వమన్నారు.
ఈ కార్యక్రమంలో కంభం మండల తాసిల్దార్ వి కిరణ్ కుమార్. ఎంపీడీవో వీరభద్రా చారి. కంభం. మండల తెలుగుదేశం పార్టీ. అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతం శ్రీను, రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెపల్లి మల్లిఖార్జున, లింగోజీపల్లె గ్రామ నాయకులు తాటికొండ వెంకటేశ్వర్లు, కాశయ్య, మరియు సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
