పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించండి. రెండు చుక్కలు నిండు ప్రాణాలను కాపాడుతుంది, ప్రకాశం కలెక్టర్.


 పోలియో మహమ్మారి నుండి పిల్లలను రక్షించండి.

రెండు చుక్కలు నిండు ప్రాణాలను కాపాడుతుంది, ప్రకాశం కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు,లో పిల్లలందరికీ రెండుచుక్కలు పోలియో వ్యాక్సిన్ వేయించి పోలియో మహమ్మారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం ఒంగోలునగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు జిల్లా కలెక్టర్ పోలియోచుక్కలు వేశారు.

 ఈ సందర్భం గా జిల్లాలో 0నుండి 5 సంవత్సరాల వయసు లోపుపిల్లలు 2లక్షల 44వేల112 మంది ఉన్నారని పిల్లలందరికీ నూరుశాతం పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నా మని ఆయన చెప్పారు. జిల్లాలో 0నుండి5 సంవత్సరా లవయసులోపు పిల్లలందరికీ నిర్లక్ష్యం చేయకుండాపోలియో వ్యాక్సిన్ వేయించాలన్నారు. 

జిల్లాలో పోలియో వ్యాక్సిన్ మూడు రోజులపాటు పిల్లలకి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈనెల21 ఆదివారం పోలియో దినం సందర్భంగా జిల్లాలోని అన్ని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ వద్ద పిల్లలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. సోమవారం, మంగళ వారాలు వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో,పట్టణాల్లో ప్రతి ఇంటికివెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేస్తారని ఆయన చెప్పారు.

 ఒంగోల్ రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా బాగుంద ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఅన్ని రకాల వైద్య సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడ ప్రజలందరూ కూడా సద్వినియోగంచేసు కోవాలని ఆయన ప్రజలను కోరారు. రాజీవ్ గృహకల్ప అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రైవేట్ హాస్పిటల్ కు దీటుగా ఉందని ఇక్కడి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రాంగ ణంలో మొక్కలు నాటారు.ఈకార్యక్ర మంలో జిల్లావైద్య ఆరోగ్యశాఖఅధికారి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర రావు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అన్నా కీర్తన, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చిన్నపిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

Previous Post Next Post