ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎ. రాజాబాబు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు లో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో పీ.జి.ఆర్.ఎస్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, మహిళల లైంగిక వేధింపులు, డ్రగ్స్ గoజా అక్రమ రవారణ నిరోధం తదితర అంశాలపై జిల్లాకలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలను పకడ్బందీ గా అమలు చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయికి చేరకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉంటారని ప్రజలకు పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో కొండేపి, మార్కాపురం, వై.పాలెంనియోజక వర్గాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఐ.వి.ఆర్.ఎస్ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అండదంలేదని ప్రభుత్వానికి సర్వేలు వస్తున్నాయనిఆయన అన్నారు. మండల స్థాయి అధికారులు వారంలో మూడు రోజులు ప్రజల్లో పర్య టించాలని ప్రజల సమస్యలను తెలుసు కోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయి అధికారులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వ హించాలని ఆయన చెప్పారు. జిల్లాలో సురక్షిత నీరు మాసం గా ప్రకటించడం జరిగిందనిఆయన చెప్పారు. ఈ మాసం రోజులు జిల్లాలోని అన్ని గ్రామపంచా యతీల్లో, మున్సి పాలిటీల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీల్లో పైప్ లైన్, త్రాగునీటి పథకాల మరమ్మ త్తులు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు సురక్షిత త్రాగు నీరు అందిస్తున్నామని భరోసాను ప్రజలకు కల్పించాలని ఆయన చెప్పారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేపట్టి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించా లని ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో డ్రగ్స్ గoజా పై అవగాహన కార్యక్ర మాలు నిర్వ హించా లని ఆయన చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపులు జరగ కుండా మహిళలకు, బాలికలకు అవగా హన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను ఒక్కొక్క అధికారి ఒక హాస్టల్ ను దత్తత తీసు కోవాలని ఆయన చెప్పారు. ఈనెల5న తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ ను నిర్వహించ డానికి చర్యలు తీసు కోవాలని ఆయన చెప్పారు. పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కు తల్లిదండ్రులు ఇద్దరూ తప్పకుండాహాజరు కావాలని ఆయన కోరారు.ఈవీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ ,జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్ ఓబులేసు, సిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డి.ఎస్. ఓ పద్మశ్రీ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

