అనకాపల్లి, డిసెంబర్ :10 జిల్లా ప్రజలకు మరియు వాహనదారులకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, తెలియజేయునది ఏమనగా.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా జడ్జి సూచనల ప్రకారం, తేదీ. 13-12-2025 (శనివారం) నాడు జిల్లా వ్యాప్తంగా "జాతీయ లోక్ అదాలత్" (National Lok Adalat) నిర్వహించబడుతుంది.
ఈ జాతీయ లోక్ అదాలత్‌లో, వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ ఈ-చలాన్లను (Traffic E-Challans) రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి (Compounded/Settled) ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించబడింది.
ముఖ్యాంశాలు:
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను ఈ లోక్ అదాలత్‌లో సులభంగా పరిష్కరించుకోవచ్చు.
ఇది చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ప్రజలకు ఒక మంచి అవకాశం.
దీనివల్ల భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ మరియు సమయం ఆదా అవుతుంది.కావున, అనకాపల్లి జిల్లాలోని వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, డిసెంబర్ 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, తమ పెండింగ్ చలాన్లను చెల్లించి కేసులను పరిష్కరించుకోవాలని కోరుచున్నాము.మరిన్ని వివరాలకు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా కోర్టులోని న్యాయ సేవా సదన్ ను సంప్రదించగలరు.
