రిమ్స్ వైద్యశాల మరియు గిరిజన బాలుర హాస్టల్ ను తనిఖీ చేసిన డిఆర్ఓ.


రిమ్స్ వైద్యశాల మరియు గిరిజన బాలుర హాస్టల్ ను తనిఖీ చేసిన డిఆర్ఓ.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు. లో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం తగదని జిల్లా రెవెన్యూ అధికారి .బి.చిన ఓబులేసు స్పష్టం చేశారు. 

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మితో కలిసి ఒంగోలు నగరంలోని గిరిజన బాలుర హాస్టల్ 

ను బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. హాస్టల్ లోని వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. 

స్నానాలకు సకాలంలో నీళ్లు రావడంలేదని, వర్షం పడినప్పుడు స్లాబ్ లో నుంచి నీళ్లు కారుతున్నాయని, పారిశుద్ధ్యం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా డిఆర్ఓ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. 

 దీనికి ముందుగా రిమ్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును డిఆర్ఓ పరిశీలించారు. గతవారంతో పోలిస్తే పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగుపరటాన్ని ఆయన గమనించారు. రోగులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంట డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మాణిక్యరావు, ఇతర అధికారులు ఉన్నారు..

 

Post a Comment

Previous Post Next Post