భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి రాష్ట్ర అధికార ప్రతినిధి.పిలిపు.



 భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి రాష్ట్ర అధికార ప్రతినిధి.పిలిపు.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు కంభం మండల బిజెపి అధ్యక్షులు బాదం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర బిజెపి అధికారప్రతినిధి.వై.రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె వి నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో నిన్న వాజ్పేయి విగ్రహ అవిష్కరణకు చాలామంది కూటమి నాయకులు కార్యకర్తలు వచ్చారని. ప్రకాశం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జెవి నారాయణ గారికి కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 మాజీ ప్రధాని వాజ్పాయ్ గారు ఎన్నో భారతదేశానికి టెక్నాలజీని మరియు నాలుగు లైన్ల రోడ్లు తీసుకొచ్చారని తెలియజేశారు. అలాగే ప్రస్తుత ప్రధాని మోడీ గారు మహిళల రిజర్వేషన్లు ఇచ్చారని. పీఎం కిసాన్ మరియు ఎన్నెన్నో పథకాలు ప్రజల కోసం తీసుకొచ్చారని ఆయన చెప్పారు.

 ఈరోజు పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లాగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయమని ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అన్నారు. అలాగే పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. 2026 కు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే మన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం జిల్లా అవుతుందని ఆయన చెప్పారు. అలాగే విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులనే వాడుదామని నినాదంతో. వివిధ షాపుల వద్దకు వెళ్లి ప్రజలు చైతన్యపరిచే విధంగా ఆయన తెలియజేశారు.

       ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బాదం మనోహర్. ఏల్చూరి సుబ్రహ్మణ్యం కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post