ఘనంగా నిర్వహించిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి.
గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 మీడియా ఇంచార్జ్. బి అమృత రాజ్.
ప్రకాశం జిల్లా మండల కేంద్రంలోని అర్ధవీడు సచివాలయం ఆవరణలో ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి వేడుక బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రం పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దాసరి యోబు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన బహుముఖ ప్రతిభలో ఉంది. ఆయన భారత రాజ్యాంగం నిర్మాత. న్యాయవాది ఆర్థికవేత్త. రాజకీయ నాయకుడు సంఘసంస్కర్త మరియు దళిత మహిళ కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కుల వివక్ష నిర్మూలనకు సామాజిక సమానత్వానికి మరియు అణగారిన వర్గాల సాధికారతకు తన జీవితాన్ని అంకితం చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
స్థానిక ఎంపీడీవో షేక్ కాసిం పీరా మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత పితామహుడుగా పేరుపొందారని ఆయన అన్నారు.
డి రఘునాథ్ మాట్లాడుతూ ఆర్థిక వేత్త మరియు న్యాయవాది న్యాయవాదిగా దేశానికి విశేష సేవలు అందించారని హక్కుల పోరాటం చేశారని ఆయన తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారి 1 శ్రీమతి సుజాత మాట్లాడుతూ ఈరోజు మహిళలకు చేసిన రిజర్వేషన్లు కానీ చదువు చదువులో కానీ ముందు ఉండాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ప్రత్యేక మహిళా చట్టాలు తీర్చిదిద్దిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆమె కొనియాడారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య మాట్లాడుతూ ఈరోజు రిజర్వేషన్ల వల్ల వలన ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన బడుగు బలహీన వర్గాలు ఈరోజు రిజర్వేషన్లు పొంది ఐపీఎస్ ఐఏఎస్ లు అయ్యారని అలాగే విద్యార్థులు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపో వాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అలాగే బిజెపి సీనియర్ నాయకులు జీవి రమణారావు మాట్లాడుతూ. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి చెందిన వాడు కాదని అందరివాడని ఆయన అన్నారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే ఈరోజు మన భారతదేశం ఎట్లా ఉండే దో అని ఆయన వివరించారు. ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ శ్రీమతి అనురాధ మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతికి నేను రావటం చాలా సంతోషంగా ఉందని అలాగే మహిళా రిజర్వేషన్ శాతంలో నేను కూడా ఒక డాక్టర్ గా అయినానని ఆయన కష్టపడి రాజ్యాంగ ఫలాలు అందించాడని ఆమె అన్నారు. స్థానిక సర్పంచి వసంతం మా మాట్లాడుతూ ఈరోజు మహిళ రిజర్వేషన్ వలన నేను ఒక దళిత కుటుంబము నుండి ఒక సర్పంచ్ గా ఉన్నాను అంటే ఆయన పెట్టిన రిజర్వేషన్ భిక్షమే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యాసాగర్. చాందు. పీరా. విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.

