ప్రజా ఫిర్యాదుల వేదికలో 66 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు.


 ప్రజా ఫిర్యాదుల వేదికలో 66 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు. అనకాపల్లి, డిసెంబర్ :08 అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మొత్తం 66 ఫిర్యాదులను స్వీకరించారు.

స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు:

భూ తగాదాలు – 31, కుటుంబ కలహాలు – 3,మోసపూరిత వ్యవహారాలు – 3, ఇతర విభాగాలకు చెందినవి – 29.

ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలి. 7 రోజుల్లోపు విచారణ పూర్తిచేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యల నివేదికలను జిల్లా పోలీసు కార్యాలయానికి తప్పనిసరిగా సమర్పించాలి,” అని స్పష్టం చేశారు.

ఫిర్యాదు దారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత. ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ  ఎల్.మోహనరావు, ఎస్సై విశ్వనాథం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post