ఏలూరు జనసేన పార్టీ లోకి కొనసాగుతున్న వైసీపీ నాయకుల చేరికలు.
వివిధ ప్రాంతాల నుండి 30 మంది కి పైగా వైసీపీ కి చెందిన నాయకులు కార్యకర్తలు జనసేనలోకి చేరిక.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్ 20:- ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి పార్టీ కార్యాలయం లో వివిధ ప్రాంతాలకు నుండి వైసీపీకి చెందిన సుమారు 30 మందికి పైగా నాయకులు కార్యకర్తలు దేవరపల్లి రత్నబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి అప్పలనాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రజల పక్షాన పోరాడి, నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, జనసేన పార్టీ విధివిధానాలను మెచ్చి ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరిస్తున్నారన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాష్ట్రానికి అభివృద్ధి తేవాలనే దృఢ సంకల్పం ప్రజల మనసులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఏలూరులో ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ నాయకులు కూడా అదే స్ఫూర్తితో జనసేన పార్టీలో చేరారు. సామాన్య కార్యకర్తలకు గుర్తింపు లభించే జనసేనలో చేరికలు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ "వైసీపీలో అవినీతి, ప్రజల పట్ల నిర్లక్ష్యమే రాజ్యాంగ మారింది. అందుకే చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నాం" అని వారు వెల్లడించారు. చేరిన వారిలో విపర్తి సుధాకర్ (విద్యానగర్), పెండ్యాల అప్పన్న (శనివారపు పేట ఇందిరా కాలనీ), కరణం ఆదినారాయణ, శివ (దక్షిణపు వీధి), కొల్లెపల్లి గంగాధర్ రావు (రామానగర్ కాలనీ), గెద్దల జోసెఫ్ (వంగాయగూడెం), తిరుమలశెట్టి శ్రీనివాస్ (తూర్పు వీధి), కొడవలి దీపక్ (గవరవరం చెరువుగట్టు), పైలా కనకరాజు (లంకపేట), విజయ్ (జగజ్జీవన్ కాలనీ) తదితరులు ఉన్నారు.. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నగిరెడ్డి కాశీ నరేష్, కూనిశెట్టి మురళికృష్ణ, ఎట్రించి ధర్మేంద్ర,జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆదరణ పొందుతున్న జనసేన నాయకుడు రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచినట్లు చేరిన నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు..
