ప్రజలపై కల్ల- బొల్లి ప్రేమ చూపిస్తున్న ఏలూరు నగర కమీషనర్.
కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ సిబ్బంది.
100సంవత్సరాలు పైబడిన పురాతన బ్రిటీష్ కట్టడాన్ని కూల్చివేయడం వెనుక స్వలాభం ఎవ్వరికి ఎంత?
ఏలూరు ఇరిగేషన్ డిపార్టుమెంటు ఏమిచేస్తుంది..? తమ ఇరిగేషన్ భవనాన్ని కూల్చివేస్తుంటే ఇరిగేషన్ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారా..? లేక కాసుల మత్తులో ఉన్నారా..?
100సంవత్సరాలు పైబడిన బ్రిటిష్ కట్టడాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా తొలగించడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి ?.
పురాతన బ్రిటిష్ కాలం నాటి భవనాన్ని సంబంధిత డిపార్టుమెంటు వారి అనుమతులు లేకుండా కూల్చి వేయడం వెనుక ఉన్న రాజకీయ శక్తి ఎవ్వరు?
బ్రిటిష్ కట్టడం కూల్చడం వెనుక ఎవ్వరికి లబ్ది చేకూరుతుంది..?
ఎవరి వాటా ఎంత..?
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా... ఏలూరు స్థానిక హనుమాన్ నగర్ కృష్ణా కాలువ హనుమాన్ నగర్ బ్రిడ్జ్ నుండి కొత్తూరు వెళ్ళే రోడ్.. బ్రిడ్జ్ నుండి సుమారు 200 ల మీటర్ల దూరం లో ఉన్న పాత బ్రిటీష్ కట్టడం పడమట లాకుల్ ఇరిగేషన్ పరిధిలో ఉంది. ఆ ఇరిగేషన్ బిల్డింగ్ ని ఏలూరు నగర మునిసిపల్ కమీషనర్ ఎటువంటి అనుమతులు లేకుండా... సంబంధిత ఇరిగేషన్ వారినుండి ఎటువంటి సూచనలు తీసుకోకుండా పురాతన కట్టడాన్ని కూల్చివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి ?.
తమకు చెందిన పురాతన కట్టడాన్ని కూల్చివేయడం పై ఎటువంటి ప్రతిష్పందన లేకుండా... చూసి చూడనట్లు వ్యవహారిస్తూ నిద్రావస్థలో ఉన్న ఇరిగేషన్ అధికారులు.. ఇటువంటి పురాతన 100సంవత్సరాలలు పై బడిన బ్రిటీష్ కట్టడాన్ని కూల్చడానికి ఎటువంటి పర్మిషన్లు తీసుకోవాలి ?అస్సలు సంబంధిత ఇరిగేషన్ అనుమతి తీసుకోవాలని లేకుండా... ఉద్దెశ్య పూర్వకంగానే కూల్చినట్లు, ధీని వెనుక పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయి అనేది ప్రజల వాదన....
బ్రిటిష్ కట్టడాన్ని హడావుడిగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కూల్చివేయడం వెనుక ఏలూరు నగర మున్సిపల్ కమీషనర్ గారి ఉత్సాహం ఏమైయి ఉంటుందో ప్రజలకు అర్ధం కావడం లేదు.
ఆ పురాతన కట్టడాన్ని తొలగించి... ఎవ్వరిని కోటిశ్వరులని చేస్తున్నారు అనేది ప్రజలలో ప్రశ్నగా మారింది. దీని వెనుక భారీగా లబ్ది పొందుతున్నది ఎవ్వరు.? ప్రజల శ్రేయస్సు కోసం అని భుకాయిస్తున్న ఏలూరు నగర మున్సిపల్ కమీషనర్.... ఏలూరు నగరంలో చాలా ఏరియా లలో కనీసం మురుగు నీటి డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేని ఏరియాలు చాలా ఉన్నాయి... రోడ్లకి ఇరువైపుల డ్రైనేజీ సిస్టమ్ పైన ఆక్రమించి స్థిర కట్టడాలు కట్టడం వల్ల పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ క్లీన్ చెయ్యడానికి వీలు లేకుండా సమస్యగా ఉన్న కట్టడాలు చాలా ఉన్నాయి... వాటిని ఎందుకు కూల్చడం లేదు ఈ కమీషనర్...?
ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏలూరు నగరంలో కాస్త గట్టిగా వర్షం పడితే చాలు... అంతే... రోడ్ల పరిస్థితి చెప్పనక్కరలేదు.. రోడ్లన్నీ జలమయంగా మారి చెరువులు లాగ తలపిస్తుంటే... ప్రజలు తమ తమ వాహనాలను వదలి వారు చేరు గమ్యానికి ప్రభుత్వం పడవలు సౌకర్యం కల్పిస్తే భాగుంటది అనే అభిప్రాయానికి వచ్చేసారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే... మున్సిపాలిటీ కమర్షియల్ స్థలాల్లో అక్రమ కట్టడాలు, పరిశుభ్రం లేని త్రాగునీరు, కృష్ణా కాలువ కలుషితం, పోనంగిలో ఆక్రమణలో బ్రాహ్మణ స్మశాన వాటిక ఇలా అనేక ప్రజా సమస్యలు కమిషనర్ కి కానరావడం లేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు.విలేకర్ల కధనాలు కేవలం కాగితాలకే పరిమితం అవ్వుతున్నాయి... ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి... పురాతన బ్రిటీష్ కట్టడాన్ని కూల్చివేసిన శిదిలాలు పరిశీలించి వాటి అవశేషాలు కనుమరుగు కాకుండా తగు చర్యలు తీసుకుంటారేమో... పురాతన కట్టడాలకు తగు రక్షణ కల్పిస్తారో... లేదో వేచి చూడాలి...!
Add


