గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 మీడియా ఇంచార్జ్ అమృత రాజ్.
చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ పై దాడి చేసిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ ను దేశ బహిష్కరణ చేయాలిఎంఆర్పిఎస్ నేత షాలేంరాజ్,డిమాండ్.
ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయం నందు చలో ఢిల్లీ మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం శాలెం రాజు మాట్లాడుతూ
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సనాతన మనవాది లాయర్ రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేయాలని జస్టిస్ గవాయ్ పై దాడి రాజేంగంపై దాడిగా అంబేద్కర్ ఆశయాలపై దాడిగా దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పై దాడి అని దీన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖo డించాలని రాకేష్ కిషోర్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి దేశ బహిష్కరణ చేయవలసిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ పానుగంటి షాలెం రాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సంఘటన జరిగి నెల రోజులు దాటినను దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం ఢిల్లీలో బిజెపి ప్రభుత్వమేనని కేంద్రంలో కూడా బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉందని జరిగిన సంఘటనపై మన గౌరవ ప్రధానమంత్రి మోడీ కంటితుడపుగా తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టడం సరైన విధానం కాదని నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాజ్యాంగంపై గాని న్యాయవ్యవస్థపై గాని నమ్మకం ఉంటే దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు ఎందుకు చర్యలు తీసుకొని లేకపోతున్నాడో భారతదేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
దాడికి పాల్పడిన వ్యక్తి వెనుక బిజెపి రహస్య అజెండా ఉందని ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారని ఇలాంటి చర్యలు ఇదేవిధంగా కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని జస్టిస్ గవాయిపోయి దాడి చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని అందులో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో ఈనెల 20న చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజాస్వామిక వాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోడిచర్ల రాజు నేధరపల్లి జయరాజ్ బుదాల ఆనంద్ కర్ర రాజారత్నం దుగ్గిపోగు ప్రభాకర్. కుమార్. రాజు.భాస్కర్.రమేష్.ఏసు.ప్రసాద్. రూపస్. శ్యాం.రమేష్ బాబు. జెకర్య.రత్నం. చిన్న.శేఖర్.విజయ్.ఖాసీం. తదితరులు పాల్గొని చలో ఢిల్లీ మహా ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు...
