స్థానిక సంస్థల ఎన్నికలపై ఏలూరు జనసేన సమాయత్వం.


స్థానిక సంస్థల ఎన్నికలపై ఏలూరు జనసేన  సమాయత్వం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు, నవంబర్ 21:- స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన శ్రేణులు దృష్టి సారించాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. ఏలూరులోని 50 డివిజన్ లలోను కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాల్సిందిగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఇప్పటికే పలు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేశామని, డివిజన్ కమిటీల నియామకం తో బూత్ స్థాయిలో పార్టీ బలం పెరిగిందని, ఏలూరులో త్వరలోనే నగర కమిటీ తో సహా పలు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బుధ్ధా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post