నేత్ర సంరక్షణ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్.



నేత్ర సంరక్షణ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్.


 క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ చక్రవర్తి.

సానా సతీష్ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యం లో  21.11.2025 వ తేది నాడు ఏలూరు అమీనా పేట లో ఉన్నటు వంటి సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నేత్ర సంరక్షణ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్  మాట్లాడుతూ అన్ని అవయవల కెల్లా కంటి చూపుకు ప్రాధాన్యత ఉందని, విద్యార్థి దశ నుంచే కంటి చూపు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో తెలియ చేసినారు.

    ఈ కార్యక్రమంలో అతిథి గా పాల్గొన్న ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్  మాట్లాడుతూ కంటి సంరక్షణ కార్యక్రమాన్ని స్థాన సతీష్ ఫౌండేషన్ వారు పోలీస్ స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషదాయకమని, ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో అవసరమని, కంటి చూపు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జిల్లా ఎస్పీ గారు 8వ తరగతి లోనే చదువుతూ ఉండగానే తన యొక్క కంటి చూపుకు చూపించు కోవడం వలన కంటి అద్దాలు వేసుకోవడం వలన చదువులో ప్రాముఖ్యతను కలిగినానని పోలీస్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు పేద మధ్య తరగతి వారు అని గ్రహించినటు వంటి సానా సతీష్ ఫౌండేషన్ ఈ కంటి చూపు విద్యార్థి విద్యార్థులలో చూపించడం హర్షించదగినటు వంటిదని విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, మనిషి యొక్క ఆస్తి అంటేనే శరీర భాగాలని, కోట్లు సంపాదించిన శరీర భాగాలు పోతే అవి తిరిగిన పొందలేమని కంటి చూపు వలన చాలా విలువ అయినాది అని, కంటిని సంరక్షించు కోవాలని కంటికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మీరు తీసుకొనడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు చుట్టు ప్రక్కల వారికి కూడా కంటి చూపు పట్ల అవగాహనను కల్పించాలని, పోలీస్ స్కూల్ అంటేనే డిసిప్లేన్ కి మారు పేరు అని విద్యార్థిని విద్యార్థులు కంటిచూపు పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  విద్యార్థిని విద్యార్థులకు తెలియ చేసినారు.

        ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్  మాట్లాడుతూ సర్వేంద్రి యానం నయనం ప్రధానం అని కంటి చూపును కోల్పోతే ప్రపంచాన్ని ఏమీ చూడలేమని, ప్రపంచంలో ఉండేటటువంటి విశేషాలను గ్రహించలేరని ప్రపంచంలో ఏమి జరుగుతుందో అని కూడా చూడలేరని, విద్యార్థి దశ నుంచి విద్యార్థిని విద్యార్థులు కంటి చూపు పై దృష్టి పెడితే ఎటువంటి వ్యాధులురావని తల్లి దండ్రులు వారి యొక్క పిల్లలకు ముందుగా కంటి విషయంలో తగిన జాగ్రత్తలను వహించాలని సానా సతీష్ ఫౌండేషన్ వారు ఇటు వంటి కార్యక్రమాన్ని జిల్లా లోని అన్ని విద్యా సంస్థలలో నిర్వహించడం అంటే ఎంతో అభినందించదగిన విషయమని ఈ సందర్భంగా తెలియ చేసినారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఆర్ ఐ ఏ ఆర్ సతీష్  ఏలూరు త్రి టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ స్రవంతి ఆర్ఎస్ఐ నరేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post