ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన రెడ్డి అప్పలనాయుడు.


 ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా  మీడియా సమావేశాన్ని నిర్వహించిన రెడ్డి అప్పలనాయుడు.

ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నాం.

కూటమి ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధికి పనిచేస్తుంది.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.

ఏలూరు, నవంబర్ 20:- ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి పనిచేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు నారా లోకేష్ గారికి నాదెండ్ల మనోహర్ గారికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఆర్టీసీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సైతం విజయవంతంగా నడుస్తుంది రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 7, 8 లక్షల మంది మహిళా సోదరి సోదరీమణులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. విజయవాడ నుండి వైజాగ్ వెళ్లే బస్సులు, వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే బస్సులు హైవే మీద నుండి వెళ్లిపోవడంతో ‌ చాలామంది ప్రయాణికులు అర్థరాత్రి ఆశ్రం బైపాస్ వద్ద దిగాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.‌ చాలామంది ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. మొన్న జరిగిన ఆర్టీసీ బోర్డు మీటింగ్లో ఈ సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రతి బస్సు ఏలూరు వచ్చి వెళ్లే విధంగా ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ వద్ద సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇకనుండి ప్రతి బస్సు కూడా తప్పనిసరిగా ఏలూరు కొత్త బస్టాండ్ కి వచ్చి తీరుతుందన్నారు.‌ ఏలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరు. ఏ బస్సు అయినా రానిపక్షంలో తమ దృష్టికి తీసుకురావాలని, దానిమీద చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రవాణా అనేది చాలా బలమైన వ్యవస్థ. ఇటువంటి ఆర్టీసీకి నేను విజయవాడ జోనల్ చైర్మన్ గా ఉండడం మా పార్టీ ఇచ్చిన అవకాశం గా భావిస్తున్నాం. ఆర్టీసీలో ఇంకా ముందు రోజుల్లో మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని, నూతన ఎలక్ట్రానిక్ బస్సు సైతం రాబోతున్నాయి అని అన్నారు".. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), నాయకులు రెడ్డి గౌరీ శంకర్, ఏలూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ జంగం కృపానందం, మీడియా ఇంచార్జీ జనసేన రవి, నాయకులు సానాసి వెంకట రమణ, వేగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post