ముగిసిన 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవలు.



 ముగిసిన 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవలు.

ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధీనంలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒంగోలు నందు 58వ జాతీయ గ్రంధాలయ వార్షికోత్సవ వేడుకలలో చివరి రోజు ముగింపు వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మరియు పర్సన్ ఇంచార్జ్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఒంగోలు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో వారు విద్యార్థినీ విద్యార్థులకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం చెప్పారని అన్నారు.అనగా పుస్తకం జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

 వారంలో ఒక్కరోజు అయినా గ్రంథాలయాన్ని సందర్శించి మీరు ఏదో ఒక ఆక్టివిటీని అలవర్చుకొని అది పేపర్ చదవడం డ్రాయింగ్ వేయడం మొదలగునవి ఆక్టివిటీలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంపొందించుకొనవల్సిందిగా సూచించారు.

 చరవారికి దూరంగా ఉండి వార్తాపత్రికలను పుస్తకాలను చదవడం అలాగే మీ కలలను డెవలప్ చేసుకొనవలసినదిగాను, మీకు నచ్చిన కలలు సంగీతము నృత్యము డ్రాయింగ్ పెయింటింగ్ మొదలగునవి డెవలప్ చేసుకుని ఒక్క చదువుకే ప్రాధాన్యత ఇవ్వకుండా కలలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతూ మీ గమ్యాన్ని మీరు చేరుకోవాల్సిందిగా సూచించారు   

ఈ వారోత్సవ కార్యక్రమంలో పాల్గొనినందుకు విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. వారం రోజులపాటు జరిగినటువంటి పోటీలలో పాల్గొని విజేతలుగా పొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి. జీవి శివారెడ్డి , ఇన్చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ కె సంపూర్ణమ్మ , సందీప్ అనిల్ ,శివకుమారి, గోవిందమ్మ మరియు కార్యాలయ సిబ్బంది సాంసన్, కృష్ణవేణి ,మృదుల్ కుమార్ మరియు గ్రంథాలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 .

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post