రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలో వరి ధాన్య సేకరణకు రైస్ మిల్లర్స్ సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో జిల్లాలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్ లో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
జిల్లాలో రైస్ మిల్లర్ల ప్రతినిధులు ధాన్య సేకరణకు రైస్ మిల్లులను సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. వరి ధాన్య సేకరణకు అవసరమైన ఖాళీ గోతాలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలియజేశారు . వరి ధాన్య సేకరణకు అవసరమైన బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన చెప్పారు. జిల్లాలో 44 రైతు సేవ కేంద్రాల ద్వారా 26 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వరిధాన్యం సేకరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు.
జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డి.ఎం వరలక్ష్మి, డి.ఎస్.ఓ పద్మశ్రీ, రైస్ మిల్లర్ల ప్రతినిధి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Add
.jpg)

