ప్రభుత్వ వైద్యశాలకు కుర్చీల బహుకరించిన పాఠశాల కరస్పాండెంట్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. ప్రకాశం జిల్లాగిద్దలూరు మున్సిపాలిటీ లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు సూర్య విద్యా నికేతన్ పాఠశాల కరస్పాండెంట్ దప్పిలి గురు బ్రహ్మానందరెడ్డి వారి తండ్రి కీ"శే" దప్పిలి ఈశ్వర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వైద్యశాలకు కుర్చీలను బహుకరించారు.ఈ సందర్భంగా గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల
సూపరెండెంట్ షేక్ ఆదాం గారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే నానుడిని బ్రహ్మానందరెడ్డిగ, విద్యార్దులకు బోధిస్తూ,స్వయంగా ఆచరిస్తూ,విద్యార్థులలో సేవ భావాన్ని పెంపొందిస్తున్నారు అని వారి సేవభావాన్ని కొని యాడారు.ఈ కార్య క్రమంలో పాఠశాల డైరెక్టర్ దప్పిలి పద్మావతి,సీనియర్ వైద్యులు కడప రమణా రెడ్డి గారు,మహిళా వైద్యురాలు సింధు.,వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
