అన్నదాత సుఖీభవ రెండవ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల,
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం మార్కెట్ యార్డులో అన్నదాతల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం అన్నదాత సుఖీభవ మరియు,పి. ఎం కిసాన్ 2025-2026 రెండవ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకానికి రూ,5000 దేశ ప్రధానమంత్రి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం పి.ఎం కిసాన్ పథకం కింద రూ , 2000 మొత్తం కలిపి రూ , 7000 జరుగుతుంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలు కలిసి సంవత్సరానికి రూ , 20,000 /- మొత్తం రైతుల ఖాతా లో జమ చేయడం జరుగుతుంది ఇది భూ యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా అందజేస్తూ మన ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలియజేశారు
ఈ పధకం క్రింద రైతులకు ఆగస్టు నెలలో మొదటి విడత జమ చేయడం జరిగింది. రెండవ విడత ఈ రోజు అనగా నవంబర్ 19 తేదీన విడుదల చేసింది ఇందులో మన గిద్దలూరు నియోజకవర్గంలో 37,649 మంది రైతులకు గాను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల 38 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు రైతు అన్నదాతల శ్రమయే రాష్ట్రానికి ఆర్థికబలం అని వారికి అండగా మన డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నారనితెలిపారు,ఇంకా పూర్వము రైతులు సేంద్రియ ఎరువుల వాడకం వల్ల వ్యవసాయం చేసేవారు కానీ ప్రస్తుతం నకిలీ విత్తనాలు , రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్నారు, ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం హామీలు అన్ని అమలుచేసి 17 నెలలకే సూపర్ హిట్ చేశామన్నారు ,
మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి తో సుపరిపాలన అందిస్తూ ఈ రోజు రెండవ విడత అన్నదాత నిధులు విడుదల చేశారు కనుక మనం అందరూ ఎప్పుడూ ఇంత మంచి తెలుగుదేశం పార్టీని ఆదరించాలి అని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు వీరితో పాటుగా కార్యక్రమంలో గిద్దలూరు , 6 మండల వ్యవసాయ శాఖ అధికారులు. 6 మండల రెవెన్యూ శాఖ అధికారులు . మండల అభివృద్ధి శాఖ అధికారులు. మరియు కంభం . గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ లు బైలడుగు బాలయ్య , పూనురు భూపాల్ రెడ్డి , డైరెక్టర్ లు గిద్దలూరు నియోజకవర్గ,పట్టణ నాయకులు , రైతులు , కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు,
