విశాఖ సీఐఐ సదస్సు ద్వారా 614 ఎంవోయూలతో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16 లక్షల ఉద్యోగాలు - మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
ఈ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు, 5 వేలకు పైగా ఉద్యోగాలు.
వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేశ్ కి కృతజ్ఞతలు.
చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ.
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం.
రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేకనే వైసిపి నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలుచేస్తున్నారన్నారు.