ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం.


ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం కార్యక్రమును స్పందన సమావేశ మందిరములు నిర్వహించడమైనది ఈ సందర్బముగా ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ప్రపంచ ప్రీమెచ్యూరిటీ దినోత్సవం నవంబర్ 17న జరుపుకుంటాము ప్రతి గర్భిణీస్త్రీకి సకాలములో అన్ని సేవలు అందించి ప్రీమెచ్యూరిటీ మరణములను నివారించవలసినదిగా తెలియజేశారు 

  ఇది నెలలు నిండకుండా పుట్టిన శిశువులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది ప్రధాన ఉద్దేశ్యం నెలలు నిండకుండా పుట్టే శిశువుల ఆరోగ్యం మరియు మనుగడ కోసం తగిన సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడం అకాల శిశువులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వైకల్యాలు మరియు అభివృద్ధిలో జాప్యాలను తగ్గించడం ముందస్తు జననాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం ముందస్తు శిశువులకు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడం. ప్రతి గర్భిణీస్త్రీకి ఎ యన్ యమ్ వద్ద రిజిస్టేషన్ అయినా తరువాత ఆమెకు అందవలసిన అన్ని సేవలను సకలమూలంలోఅందించివివరములనుయమ్ సి పి కార్డ్ నందు నమోదుచేయలన్నారు,ప్రమాద సంకేతములుగల గర్భిణీస్త్రీలను గుర్తించి వారికీ విధిగా సమీపములో ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వారికీ అని సేవలను సకాలములో అందించి అవివారములను గర్భిణీస్త్రీకి వారి బందువులకు తెలియపరచవలెను నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసియున్న వసతులను గర్భిణీస్త్రీకి వారి బందువులకు తెలియపరచవలెను అలాగా చేయడం వలన మనము శిశుమరణములను నివారించవచ్చును ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 15 మిలియన్ల మంది పిల్లలు అకాల శిశువులుగా జన్మిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పుట్టే పది మంది శిశువులలో ఒకరు. కాబట్టి ఈ అంశంపై అవగాహన చాలా ముఖ్యం. అకాల ప్రసవం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, అకాల శిశు జననాల వల్ల ఎదురయ్యే సవాళ్లపై దృష్టి సారించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రధాన లక్ష్యాలు మరియు సమాచారం:అవగాహన: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది శిశువులలో ఒకరు అకాలంగా (గడువుకు ముందే) జన్మిస్తున్నారు. ఈ సంఖ్యను తగ్గించడంపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం ప్రపంచ ప్రాధాన్యత అకాల ప్రసవం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు యునిసెఫ్ వంటి సంస్థలకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గుర్తింపు ఈ దినోత్సవాన్ని సూచించడానికి ఊదా రంగు (పర్పలే కలర్)ను ఉపయోగిస్తారు. నివారణ మరియు సంరక్షణ అకాల ప్రసవానికి గల కారణాలను తెలుసుకోవడం, గర్భిణులకు సరైన సంరక్షణ అందించడం, మరియు అకాలంగా జన్మించిన శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం యొక్క ఆవశ్యకతను ఈ దినోత్సవం నొక్కి చెబుతుంది . ఈ కార్యక్రమములో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి. వెనకటేశ్వర్లు , డాక్టర్ కమలశ్రీ జిల్లా వ్యాధినివారణ టీకాల అధికారి , డాక్టర్ హేమంత్ , జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇతర జిల్లా అధికారులు,జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

Post a Comment

Previous Post Next Post