విశాఖ సీఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు.

విశాఖ సీఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వీటి ద్వారా జిల్లాలో 5 వేల మందికిపైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం టంగుటూరు తూర్పు నాయుడుపాలెం, 

విశాఖ సీఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులు, 5 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సోమవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.

ఈ నెల 14, 15 వ తేదీల్లో విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు ద్వారా 614 ఎంవోయూలతో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయి. అందులో ప్రకాశం జిల్లాకు రూ.3,704 కోట్ల పెట్టుబడులతో 5 వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేశ్ కి కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం. ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం..కానీ 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి డా.డోలా,బాల వీరాంజనేయస్వామి అన్నారు.
 

Post a Comment

Previous Post Next Post